గ్లామర్ రోల్స్ కోసం సిద్ధమంటున్న భూమిక?

Tuesday, October 2nd, 2018, 10:57:38 AM IST

భూమిక .. అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకుంది. దాదాపు కొన్ని సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగిన ఈమె క్రేజ్ తగ్గడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. కొన్నాళ్ళు ఫ్యామిలీని చూసుకున్న ఈమె తాజాగా సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. హిందీలో ఎం ఎస్ ధోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక తెలుగులో నాని హీరోగా నటించిన ఎం సి ఏ సినిమాలో వదిన పాత్రలో ఆకట్టుకుంది. తాజాగా సమంత యూ టర్న్ లో కూడా నటించిన భూమిక ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమాలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం భూమిక ఫోకస్ వదిన, అక్క పాత్రలు కాకుండా గ్లామర్ పాత్రలు చేయాలన్న ఆలోచనలో ఉందట ..అదికూడా హీరోయిన్ శ్రియ తరహాలో ? శ్రియ కూడా సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి .. హీరోయిన్ పాత్రల్లోనే నటిస్తుంది. సీనియర్ హీరోలకు ఎలాగూ హీరోయిన్ కావాలి కాబట్టి .. ఇప్పుడు మేకర్స్ అందరు శ్రియ కె ప్రాధాన్యత ఇస్తున్నారు .. అదే తరహాలో భూమిక కూడా సీనియర్ హీరోలతో రొమాన్స్ కు రెడీ అంటుందట. నిజమే ఇక్కడ గ్లామర్ హీరోయిన్ గా ఉంటేనే ఎక్కువకాలం ఉండగలరు .. లేదంటే అన్ని సర్దేసుకుని వెనక్కి వెళ్లిపోవాల్సిందే.