బిగ్ బాస్ 2 కి కంటెస్టెంట్లుగా ఇద్దరు గ్లామర్ బ్యూటీస్

Thursday, May 17th, 2018, 12:58:52 PM IST

బిగ్ బాస్ తెలుగు, హిందీ, తమిళంలో అతిపెద్ద షోగా బుల్లు తేరా అభిమానుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ షోగా నిలిచిందనడంలో ఆశ్చర్యం లేదు. షో స్టార్ట్ అవ్వగానే ప్రేక్షకులను టీవీలకు కట్టిపారేసే ఈ షోలో ఇదివరకటి బిగ్ బాస్ సీజన్ 1లో జూ. ఎన్టీఆర్ హోస్ట్ గా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 2లో మన ముందుకు వచ్చేది ఎవరనుకుంటున్నారా… నాచురల్ స్టార్ నాని. అవును నాని సీజన్ 2కి ఎంపిక చేయగా దీనికి నాని 4 కోట్లు రెమ్యునరేషన్ తీస్కోనున్నట్లు తెలిసింది. ఇదివరకంటే ఈ సీజన్ మరింత గ్రాండ్ గా చూపించడానికి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో అతి భారీ సెట్ వేస్తున్నారు.

అంతేకాకుండా పార్టిసిపేట్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాడునిక టెక్నాలజీ కలిగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారట. వచ్చే జూన్ నుంచి బిగ్ బాస్ సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కానుందని సెట్స్, మరియు టెక్నికల్ వర్గం తెలియజేయగా ఈ సీజన్ లో 100 ఎపిసోడ్స్ వరకు ప్లాన్ చేసారని తెలుస్తుంది. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హిట్లు కొట్టి బాగా గ్యాప్ తీస్కున్న ప్రముఖ నటీమణులు గజాలా, తేజస్వి, సీనియర్ నటి రాశి, సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల తదితరులు ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నారని తెలుస్తుంది. అంతా ఒకే ఇప్పుడు అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 2లో అభిమానులకు మరింత ఆసక్తి కలిగించడానికి నాని సరసన ఇద్దరు గ్లామర్ బ్యూటీస్ ని తీసుకురానున్నారు.