పిక్ టాక్‌: ఇంత తీరుబ‌డిగా ఎలా కుదిరింది?

Saturday, April 28th, 2018, 11:04:48 PM IST


బాలీవుడ్ బెబో సిస్ట‌ర్స్ క‌రీనాక‌పూర్‌, క‌రిష్మా క‌పూర్ వ్య‌వ‌హారం చూశారా? ఇటీవ‌లి కాలంలో ఈ ఇద్ద‌రూ చెల‌రేగిపోతున్న తీరుపై యువ‌త‌రంలో హాట్ డిస్క‌ష‌న్ సాగుతోంది. ఇదివ‌ర‌కూ ఓ ఫేమ‌స్ డిజైన‌ర్ సార‌థ్యంలో ఫ్యాష‌న్ షోలో ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేశారు. ఇప్పుడు ఇదిగో ఇలా రిలాక్స్ మోడ్‌లో కెమెరాకి ఫోజులిచ్చి మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. క్యాడ్బ‌రీ చాక్లెట్ యాడ్‌లో బ్ర‌ద‌ర్స్‌లా ఈ సిస్ట‌ర్స్‌ని చూస్తుంటే చాలానే ముద్దొచ్చేస్తున్నారు. చ‌క్క‌నమ్మ‌లు ఇలా రిలాక్స‌వుతున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అక్క‌డేదో ఖాళీగా సోఫాలో ఆరాంగా తీరుబ‌డిగా అలా వాలిపోయే అదృష్టం వీళ్ల‌కే ద‌క్కినందుకు చూసేవాళ్లు ఇంకెంతో కుళ్లుకుపోతున్నారో ఏంటో? ప‌్ర‌స్తుతం ఈ క‌ళాత్మ‌క ఫోజుల‌కు యూత్‌లో వేడెక్కించే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా ఆ రెబాన్ క‌ళ్ల‌ద్దాల‌తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్న తీరుపైనా ముచ్చ‌టించుకుంటున్నారు. ఇంత‌కీ ఈ సిస్ ఇద్ద‌రూ క‌లిసి ఒకే సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే కాద‌నకుండా చేసేస్తారేమో?

  •  
  •  
  •  
  •  

Comments