బేగం బజార్‌లో వారంపాటు దుకాణాలు బంద్.. కరోనా కేసులే కారణం..!

Thursday, June 25th, 2020, 10:21:29 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండడంతో నగరవాసులు భయపడిపోతున్నారు.

అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి వచ్చే ఆదివారం వరకు బేగంబజార్‌లోని దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ కిరాణా వ్యాపారుల అసోషియేషన్ నిర్ణయించింది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికి కేసులు పెరుగుతుండడంతో వ్యాపారం చేయడానికి వ్యాపారస్తులు భయపడుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.