బెల్లం కొండ కి షాకింగ్ ఖర్చు పెట్టిస్తున్న బోయపాటి :

Friday, December 30th, 2016, 11:38:18 AM IST

boyapati-seenu
మొట్ట మొదటి సినిమా అల్లుడు శ్రీను తోనే తనకంటూ ఒక పాజిటివ్ మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో ఊహించని వసూళ్లు సాధించడమే కాకుండా డెబ్యూ హీరోకి ఈ రేంజ్ లో వసూళ్లు వస్తాయా అని షాక్ అయ్యేలా చేసాడు సాయి. అదంతా డైరెక్టర్ వినాయక్ చూపించిన మాస్ మహిమే అని చెప్పాలి. రెండో సినిమాని భీమనేని తో చేసి చేతులు కాల్చుకున్న బెల్లం కొండ ఫామిలీ ఇప్పుడు మళ్ళీ మూడవ సినిమాని కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి చేతిలోనే పెట్టింది. ఇప్పుడు మరోసారి మాస్ రూట్ నే ఎంచుకున్న బెల్లంకొండ.. మాస్ మూవీస్ ని తీయడంలో ఆరితేరిన బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని ఇప్పిటికే చాలా గ్రాండ్ గా మార్చేశాడు బోయపాటి. చిన్న హీరోతో చేస్తున్నా సరే.. స్టార్ హీరోల మూవీస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పుడీ సినిమాలో ఒక పాట కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేస్తున్న ఈ భారీ సెట్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ బడ్జెట్ తో రెండు లో బడ్జెట్ సినిమాలు తీసేయచ్చు కూడా. బెల్లం కొండకి అంత డబ్బు ఖర్చు పెట్టడం తో తడిసి మోపెడు అవుతోంది. మూడు సార్లు ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు మారినా.. తన స్టైల్ లోనే సినిమా తీస్తానంటున్న బోయపాటి.. ఇప్పుడు బెల్లంకొండ-రకుల్ ప్రీత్ లపై తీయనున్న పాట కోసం 3 కోట్లు కరిగించేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

  •  
  •  
  •  
  •  

Comments