మిస్టర్ పోలీస్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ?

Thursday, September 6th, 2018, 10:41:38 AM IST

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో జోరు పెంచాడు . ఇటీవలే అయన శ్రీ వాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటించాడు. ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు . దాంతో నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త కేర్ తీసుకున్న ఈ హీరో కొత్త దర్శకుడితో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా .. మిస్టర్ పోలీస్. సాయి శ్రీనివాస్ మొదటి సారి పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్, మెహ్రిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, తేజ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. మరి మిస్టర్ పోలీస్ గా ఈ యంగ్ హీరో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments