ఎక్సైజ్‌ శాఖ నిర్ణయంతో ఖంగు తిన్న బెల్టు షాపులు

Wednesday, June 5th, 2019, 02:53:02 AM IST

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి మొదటగా రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా ఎత్తివేస్తామని అప్పుడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఎక్సైజ్‌ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందితో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా మంగళవారం భేటీ నిర్వహించారు. ఈ బీటిల్ ముఖ్యంగా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాగా తక్షణమే బెట్లు షాపులను మూసివేయాలని, మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనీ ఆదేశాలు కూడా జారీ చేశారు.

కాగా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సాంబశివరావు సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామానికో కానిస్టేబుల్, మండలానికో ఎక్సైజ్ ఎస్ఐలను నియమిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ చర్యల్లో చక్కటి ప్రదర్శనను కనబర్చిన వారికి తగిన అవార్డులను మరియు రివార్డులను అందించనున్నామని స్పష్టం చేశారు. ఈ బెల్టు షాపులను మూసేయడం కోసం ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించాలని, అక్రమంగా మద్యం అమ్మేవారికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి మార్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి లాంటి మత్తు పదార్తలను అరికట్టాలని ఎక్సైజ్ సిబ్బందికి సాంబశివరావు, ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈ బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులకు సంబందించిన లైసెన్సుని రద్దు చేయాలనీ ఆ బెల్ట్‌ షాప్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 4380 వైన్ షాపులు, 800 బార్లు ఉండగా.. ఒక్కో వైన్ షాప్‌కి అనుబంధంగా 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. సీఎం ఆదేశాలతో దాదాపు 43800 బెల్ట్ షాపులు త్వరలోనే మూత పడనున్నాయి.