ప్రశాంత్ కిషోర్ ను చూసి భయపడుతున్న భాజాపా నేతలు

Monday, June 10th, 2019, 11:13:55 PM IST

ప్రముఖ రాజకీయవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లైమ్ లైట్లోకి వచ్చిందే 2014లో మోడీకి సహకరించి. ఆ సమయంలో భాజాపా నేతలంతా ప్రశాంత్ కిషోర్ పనితనాన్ని కొనియాడారు. ఇక 2015లో నితీష్ కుమార్ సైతం ప్రశాంత్ కిషోర్ సంహారం తీసుకున్నారు. ఇక గత ఏపీ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతలా పనిచేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ఆయన వ్యూహాలను వినియోగించుకోవాలని తృణామూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భావించి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.

ఇదే పశ్చిమ బెంగాల్ భాజాపా నేతాలకు మింగుడుపడటంలేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పనితనం ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి పశ్చిమ బెంగాల్ మీద పట్టు బిగించిన భాజాపా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఊపు చూపి దీదీని దెబ్బకొట్టాలని అనుకుంది. కానీ ఇంతలోనే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వడంతో భాజాపా కలవరపడుతోంది. కైలాష్ విజయవర్గీయ లాంటి కొంతమంది నేతలైతే అమిత్ షా ముందు ప్రశాంత్ కిషోర్ ఒక బచ్చా అని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.