భాగమతి నిర్మాతలు మాకంటే ముందున్నారు: దిల్ రాజు

Wednesday, January 31st, 2018, 06:24:17 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న నిర్మాతల్లో మంచి సక్సెస్ రేట్ వున్న నిర్మాతగా దిల్ రాజు దాదాపు ముందు వరసలో ఉంటారని చెప్పవచ్చు. గతసంవత్సరం ఆయన నిర్మించిన అన్ని చిత్రాలు మంచి విజయం సాధించి ఆయనని మరొక మెట్టు ఎక్కించాయనే చెప్పాలి. వాస్తవానికి ఆయన డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద గా సక్సెస్ కాకపోయినా నిర్మాతగా మాత్రం మంచి విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఈ మధ్య విడుదలయి మంచి విజయం వైపు దూసుకెళ్తున్న భాగమతి చిత్రం పై స్పందించారు. మాములుగా ఏ చిత్రం ఎంత మేర విజయం సాధించింది అనేది వీకెండ్ రోజుల్లో వచ్చే సోమవారం వసూళ్లు ఎలావున్నాయి అనే దాన్ని బట్టి తేలిపోతుందని, అలా చూస్తే మొన్న సోమవారం మధ్యాహ్నం భాగమతి చిత్రం అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయని, కలెక్షన్ 1.8 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని, దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ చిత్రం గా చెప్పవచ్చు అన్నారు. అంతే కాక తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మొదట నిర్మించిన ఆరు చిత్రాల్లో ఐదు విజయవంతమయ్యాయని, అదేవిధంగా యు వి క్రియేషన్స్ నిర్మాతలు వంశి, ప్రమోద్ లు కూడా ఇప్పటివరకు ఆరు చిత్రాలు నిర్మిస్తే ఐదు విజయవంతమయ్యాయని అన్నారు. ఈ నిర్మాతలను చూస్తే తమను తాము చూసుకున్నట్లుందన్నారు. మేము తెలుగులోనే చిత్రాలు నిర్మిస్తే వారు మాత్రం వేరే భాషల్లో కూడా చిత్రాలు చేస్తూ తమకంటే ముందున్నారని ప్రశంసించారు. దిల్ రాజు వంటి ఒక అగ్ర నిర్మాత వేరొక నిర్మాతల విజయాన్ని ఇలా కీర్తించడం మంచి ఆహ్వానించదగ్గ పరిణామమని, పరిశ్రమలో ఈ విధమైన ఆరోగ్యకర వాతావరణం వల్ల ఇండస్ట్రీ నుండి మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…..