హిట్టా లేక ఫట్టా : ‘భాగమతి’ ట్రెండీ టాక్

Saturday, January 27th, 2018, 06:55:56 PM IST

నటి అనుష్క ప్రాధాన పాత్రలో యువి క్రియేషన్స్ సంస్థ, పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో నేడు విడుదలైన భాగమతి చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాహుబలి తర్వాత చిత్రం కావడం,అందునా బాహుబలితో అనుష్క క్రేజ్ చాలావరకు పెరగడంతో ఈ చిత్రాన్ని నిర్మాతలు మూడు భాషల్లో విడుదల చేశారు. అంతేకాక నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ పోటీ లేకుండా విడుదలయిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా మంచి రికార్డులు సాధించేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రేక్షకులు నుండి మిశ్రమ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. హర్రర్ కదాంశముతో రూపొందిన ఈ చిత్రం లో అనుష్క రెండు పాత్రల్లో నటించారట. ఐఏయస్ ఆఫీసర్ చెంచల పాత్రలో, అలానే భాగమతి పాత్రలో ఇలా రెండు విభిన్న పాత్రల్లో ఆమె నటన అద్భుతమని, ముఖ్యంగా చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని తెలుస్తోంది. కథా పరంగా మొదటి అర్ధ భాగం కాస్త రొటీన్ గానే అనిపించినా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఎపిసోడ్ తో రెండవ అర్ధ భాగం పై ఆసక్తి పెరుగుతుందట. ఇక రెండవ అర్ధభాగం లో దర్శకుడు కొన్ని ట్విస్ట్ లతో కథ నడిపించిన తీరు బాగున్నా అక్కడక్కడా కొంత వెలితి కనపడుతుందని, అయితే క్లైమాక్స్ బాగుందని, ఒక రొటీన్ కాదాంశంతో చిత్రం నడిచినప్పటికీ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మరిచిన తీరులో దర్శకుడు ప్రతిభ కనపడుతుందని, మొత్తంగా చూస్తే భాగమతి ప్రేక్షకులను పూర్తిగా డిజప్పాయింట్ చేయకపోయినా బక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా నిలబడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు….

 

భాగమతి – ఆరంభంలో భయపెట్టి.. ఆఖరులో థ్రిల్ చేసింది

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

‘భాగమతి’కి భయపడటం ఖాయం!

Reviewed By telugu.samayam.com |Rating : 3/5

అనుష్క అడ్డా!

Reviewed By greatandhra.com |Rating : 3/5

భాగమతి.. కొంచెం భయం.. కొంచెం థ్రిల్!

Reviewed By tupaki.com |Rating : 3/5

అద్భుత ట్విస్ట్ నుండి హర్రర్ కథకు

Reviewed By gulte.com |Rating : 3/5