ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే! స్వీటీ ఆ ఒక్క ఛాన్స్‌ ?

Saturday, February 3rd, 2018, 08:00:04 PM IST

`అరుంధ‌తి` త‌ర్వాత మ‌రోసారి స్వీటీ అనుష్క శెట్టి పంట పండింది. మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ప‌వ‌ర్ ఏమిటో చూపించింది. అనుష్క న‌టించిన భాగ‌మ‌తి దాదాపు 50 కోట్లు వ‌సూలు చేసి స‌త్తా చాటింది. ఇక ఇదే హుషారులో స్వీటీ త‌న ఫ్యాన్స్‌కి ఓ అరుదైన ఆఫ‌ర్ ఇచ్చింది. ఎవ‌రైనా మ‌హిళా ఫ్యాన్స్ త‌న‌తో క‌లిసి సినిమా వీక్షించే అవ‌కాశం ఇస్తోంది. అది కూడా కొన్ని న‌గ‌రాల్లో ఈ అరుదైన అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. `భాగ‌మ‌తి` సినిమాని చిత్ర క‌థానాయిక అనుష్క‌తో క‌లిసి చూఏ అదృష్టం.. ఎవ‌రైనా కాద‌నుకుంటారా? అందుకే చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ కొత్త స్కీమ్‌ని ప్ర‌వేశ పెట్టింది.

ఏపీలో ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం.. అదృష్టం ద‌క్క‌నుంది. అది కూడా విజ‌య‌వాడ‌, ఏలూరులో ఈ ప్ర‌యోగం చేస్తున్నారు. అక్క‌డ కొన్ని ప్ర‌త్యేక షోల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 5న విజ‌య‌వాడ‌- రాజ్ థియేట‌ర్‌లో ఉద‌యం ఆట‌ను స్వీటీతో క‌లిసి వీక్షించే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత‌ ఏలూరులో మినీ స‌త్య‌నారాయ‌ణ థియేట‌ర్‌లో మ్యాట్నీ ఆట‌కు ఛాన్స్‌.. త‌దుప‌రి సాయంత్రం రాజ‌మండ్రి – స్వామి థియేట‌ర్‌లో మొద‌టి ఆట‌ను వీక్షించే అవ‌కాశం ఉంది. ఆ మూడు చోట్లా అనుష్క‌తో క‌లిసి సినిమా చూసే స‌ద‌వ‌కాశం ఉంది. అయితే ఈ ఆఫ‌ర్ జెంట్స్‌కు కాదులెండి.. ఓన్లీ ఫ‌ర్ లేడీస్‌… అంటూ ట్విస్టిచ్చింది యూనిట్‌.