భాగమతి బాగుందంటున్న కత్తి మహేష్!

Friday, January 26th, 2018, 04:11:33 PM IST


ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు పవన్ ఫాన్స్ తో చాలా కాలంపాటు జరిగిన వివాదం పలు మలుపులు తిరిగి చివరకు రాజీ దిశగా ముగిసింది. మొన్నఆమధ్య ఆయన పవన్ నూతన చిత్రం అజ్ఞాతవాసి పై కూడా ఆయన తనదైన రీతిలో రివ్యూ ని ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఆయన నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన అనుష్క నటించిన భాగమతి చిత్రం పై కూడా రివ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ భాగమతి మంచి హర్రర్ తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్ అని, అనుష్క తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారని, ఆమె నటన చాలా బాగుందన్నారు. జయరాం, ఆశ శరత్ కొత్తగా కనిపించారని, మది ఫోటోగ్రఫీ, రవిందర్ ఆర్ట్ డైరెక్షన్, థమన్ సంగీతం చిత్రానికి బాగా హెల్ప్ అయ్యాయన్నారు. మొత్తానికి ఈ చిత్రానికి కత్తి పాజిటివ్ గానే తన స్పందన తెలియచేసినట్లు తెలుస్తోంది. చిత్రానికి చాలా చోట్ల పాజిటివ్ టాక్ రావడం తో యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు….