`భాఘి 2` 150 కోట్ల నెట్..

Tuesday, April 10th, 2018, 10:12:42 PM IST

ఓవైపు ఐపీఎల్ ఇర‌గ‌దీస్తుంటే, మ‌రోవైపు మాస్‌ని థియేట‌ర్ల‌లోకి ర‌ప్పించ‌డంలో టైగ‌ర్ ష్రాఫ్ స‌త్తా చాటుతున్నాడు. ఇటీవ‌లే రిలీజైన భాఘి 2 థియేట‌ర్స్‌ ఇప్ప‌టికీ హౌస్‌ఫుల్స్‌తో కొన‌సాగుతుండ‌డం ట్రేడ్‌లో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. టైగ‌ర్ ష్రాఫ్‌కి మాస్‌లో ఉన్న ప‌ట్టు ఎంతో ఈ సినిమా నిరూపించింది. ఇక మాస్‌ని ర‌ప్పించే ప‌క్కా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యాయ‌ని అన‌లిస్టులు విశ్లేషిస్తున్నారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం తొలి వీకెండ్‌లోనే 100 కోట్ల క్ల‌బ్లో చేరిన `భాఘి 2` రెండో వారంలో 150 కోట్ల క్ల‌బ్లో చేరింది. ఇక ఫుల్ ర‌న్‌లో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్‌ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే సుమారు 135 కోట్ల నెట్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా, ఫుల్ ర‌న్‌లో 160 కోట్ల వ‌ర‌కూ నెట్ వ‌సూలు చేసేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక గ్రాస్ ప‌రంగా 200 కోట్ల క్ల‌బ్‌లో చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత హిందూస్తాన్ టైమ్స్ ఓ క‌థ‌నంలో వివ‌రాలందించింది. ఇక ఈ విజ‌యం ఇచ్చిన కిక్కులో టైగ‌ర్ ష్రాఫ్‌ కొత్త సినిమా `స్టూడెంట్ ఆఫ్ ది ఈర్ -2` మొద‌లైంది. త‌దుప‌రి సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ `ర్యాంబో` సెట్స్‌కెళ్లే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.