`భాఘి 2` మొద‌టిరోజు సంచ‌ల‌న వ‌సూళ్లు

Saturday, March 31st, 2018, 10:17:47 PM IST


అంతా రంగ‌స్థ‌లం స‌క్సెస్ గురించి, వ‌సూళ్ల గురించే మాట్లాడుతున్నారు. ఇటువైపు మెగాప‌వ‌ర్‌స్టార్ హ‌వా సాగుతున్న టైమ్‌లోనే, అటువైపు నుంచి టైగ‌ర్ ష్రాఫ్ సినిమా రిపోర్ట్ అందింది. టైగ‌ర్ ష్రాఫ్‌- దిశాప‌టానీ జంటగా న‌టించిన `భాఘి 2` ఈ శుక్ర‌వారం నాడు రిలీజై తిరుగులేని ఓపెనింగులు ద‌క్కించుకుంది. ఈ మూవీ డే-1లో ఏకంగా 25 కోట్ల వ‌సూళ్లు సాధించింద‌ని ట్రేడ్ చెబుతోంది. ఈ వ‌సూళ్లు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన కిక్‌, హృతిక్ న‌టించిన బ్యాంగ్ బ్యాంగ్‌, ర‌ణ‌బీర్ బేషార‌మ్ సినిమాల్ని మించి ఉంద‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లోనే టాప్ -14 ఓపెన‌ర్‌గా సంచ‌ల‌నాలు సృష్టించింది. భారీ యాక్ష‌న్ సీన్స్ తో థ్రిల్ల‌ర్ ఫార్మాట్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం యువ‌త‌రానికి పిచ్చిగా న‌చ్చింద‌ని రిపోర్ట్ అందింది.

ర‌ణ‌బీర్ క‌పూర్ `బేషార‌మ్‌` డే-1లో బాక్సాఫీస్ వ‌ద్ద 20 కోట్లు వ‌సూలు చేస్తే, అంత‌కుమించి ఈ న‌వ‌త‌రం హీరో దూసుకురావ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. హ్యాట్సాఫ్ టు టైగ‌ర్ భాయ్‌..