అనుష్క కోసం ఐదు కోట్లా ?

Wednesday, October 18th, 2017, 03:52:31 PM IST

బాహుబలి తర్వాత రానా తప్పితే ఇంతవరకు ఏ ఒక్కరు వారి నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు. ఆఖరికి దర్శకుడు రాజమౌళి కూడా నెక్స్ట్ సినిమా పై పూర్తి క్లారిటిని కూడా ఇవ్వలేదు. ఇక బాహుబలి ప్రభాస్ మాత్రం తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అనుష్క కూడా తన బాగమతి సినిమాతో బిజీగా ఉంది. కానీ సినిమాకు సంబందించిన ఒక్క ఫొటోను కూడా అమ్మడు రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం బాగమతి గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

పిల్ల జమిందార్ దర్శకుడు జి అశోక్ కుమార్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమాలో అనుష్క ఫిట్ నెస్ సరిగ్గా లేకపోవడంతో గ్రాఫిక్స్ తో కవర్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సినిమా మొదట్లో నాజూకుగా ఉన్న అనుష్క ఆ తర్వాత బొద్దుగా అవ్వడంతో సినిమా లుక్ లో కాస్త చేంజెస్ వచ్చాయని 5 కోట్లు ఎక్కువగా ఖర్చుపెట్టి అనుష్క షేప్ ను గ్రాఫిక్స్ ద్వారా చేంజ్ చేసి చూపించనున్నట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమా మాత్రం రిలీజ్ కావడానికి ఇంకాస్త లెట్ అవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments