ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న బాహుబలి రచయిత ?

Saturday, April 28th, 2018, 09:35:28 AM IST

ఆర్ ఎస్ ఎస్ ( రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ) గురించి అందరికి తెలుసు. హిందుత్వం నినాదంతో రాజకీయాల్లో క్రియశీలక పాత్ర పోషిస్తున్న ఆర్ ఎస్ ఎస్ పై ఓ భారీ సినిమా రూపొందనుంది. ఈ సంస్థ పుట్టుక, పరిణామం, చేసిన కార్యాచరణ పై ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అయితే ఈ కథను అందిస్తున్నది ఎవరో కాదు .. బాహుబలి, బజ్రంగి భాయ్ జాన్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన ది గ్రేట్ రచయితా విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే కథను మొదలు పెట్టాడని త్వరలోనే కథ పనులు పూర్తవుతాయని తెలిసింది. అన్నారు ఈ చిత్రాన్ని లహరి ఆడియో సంస్థ వేలు తులసి నాయుడు నిర్మిస్తాడట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.