భరత్ అనే నేను.. హోలీ ఫైట్!

Tuesday, May 1st, 2018, 05:38:23 PM IST

భరత్ అనే నేను సినిమా ప్రస్తుతం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. వరుస పరాజయాల ద్వారా మహేష్ నుంచి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అభిమానులకు మంచి ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే 100 కోట్లను క్రాస్ చేసి సూపర్ స్టార్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ సినిమాలో మరొక యాక్షన్ ఎపిసోడ్ యాడ్ కానుంది. సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల హోలీ ఫైట్ సిన్ తీసేయాల్సి వచ్చిందని దర్శకుడు కొరటాల శివ ప్రెస్ మీట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అభిమానుల నుంచి హోలీ ఫైట్ కావాలని డిమాండ్ ఎక్కువ రావడంతో చిత్ర యూనిట్ దాన్ని కలిపే ప్రయత్నంలో బిజీగా ఉంది. మే 4 నుంచి సినిమాలో హోలీ యాక్షన్ సిన్ చూడవచ్చని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. మరి ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments