రివ్యూ రాజా తీన్‌మార్ : ‘భరత్ అనే నేను’ – మాట మీద నిలబడ్డాడు

Saturday, April 21st, 2018, 11:20:02 AM IST

తెరపై కనిపించిన వారు : మహేష్ బాబు, కైరా అద్వానీ
కెప్టెన్ ఆఫ్ ‘భరత్ అనే నేను’ : కొరటాల శివ

మూల కథ :
ఇంగ్లాండ్ లో చుదువుకునే భరత్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాడు.

అలా ఎలాంటి అవగాహన లేకుండా సిఎం కుర్చీలో కూర్చున్న భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు ? ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు ? అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

–> మొదటి విజిల్ సిఎం పాత్ర చేసిన మహేష్ బాబుకి వేయాలి. సింపుల్ కథను, సన్నివేశాలని తన నటనతో అద్భుతంగా పండేలా చేశాడు మహేష్. సినిమా మొత్తం నిజాయితీ, భాద్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఇంటెన్సిటీతో నటించి అలరించాడు.

–> దర్శకుడు కొరటాల శివ ముఖ్యమంత్రి పాత్రలోని మహేష్ బాబుకు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు. ప్రతి సన్నివేశంలోనూ హీరోయిజం ఎలివేట్ అయ్యి అభిమానులకు ఎంజాయ్ చేయడానికి కావాల్సినంత స్టఫ్ ను అందించారాయన. కాబట్టి రెండో విజిల్ ఆయనకే వేయాలి.

–> మొదలైన వెంటనే సినిమా అసలు కథలోకి ప్రవేశించడంతో ప్రేక్షకుడు సినిమాకు బాగా కనెక్టైపోతాడు. ఇక ఫైట్స్, సెకండాఫ్లో వచ్చే ప్రెస్ మీట్, అసెంబ్లీ సన్నివేశాలు బాగా అలరించాయి. కనుక మూడో విజిల్ వీటికి వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా సెండాఫ్ ఫస్టాఫ్ ఉన్నంత గ్రిప్పింగా అనిపించలేదు. ప్రీ క్లైమాక్స్ కు ముందు కొంత లాగినట్టు అనిపిస్తుంది.

–> కథలో ప్రతినాయకుడి పాత్ర ఏమంత బలంగా అనిపించలేదు.

–> క్లైమాక్స్ కూడ ఊహాజనితంగా, కొంత తేలిగ్గానే ఉంది.
దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఎ : మహేష్ బాబు నటన ఉందిరా.. అద్బుతమమంతే.
మిస్టర్ బి : అవును.. కొరటాల టేకింగ్ కు మహేష్ పెర్ఫార్మెన్స్ తోడైతే ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూపించారు.
మిస్టర్ ఎ : మొత్తం మీద మన సిఎం మాట మీద నిలబడ్డాడు.
మిస్టర్ బి : అంతేనా.. బాక్సాఫీస్ ను కూడ దున్నేస్తాడు చూడు.

  •  
  •  
  •  
  •  

Comments