ప్రమోషన్స్ కోసం మూడుకోట్లా?

Monday, April 16th, 2018, 03:18:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న భరత్ అనే నేను సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. దాదాపు 3 కోట్ల ఖర్చుతో ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల శివ – మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తోంది. ఇంతకుముందు మహేష్ ఏ సినిమాలకు మూడుకోట్ల విలువగల ప్రమోషన్స్ చేయలేదు. హైదరాబాద్ లోనే 300కు పైగా హోర్డింగ్ సెట్ చేశారు. అలాగే డిజిటల్ మీడియాలో కూడా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు క్రేజ్ చాలా పెరిగింది. రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో కొన్ని గంటల్లోనే మొదటి షో టికెట్స్ బుక్ అయ్యాయి, మరి ఇంతలా అంచనాలు రేపుతోన్న మహేష్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments