తొలిరోజే సత్తా చాటిన భరత్ ?

Saturday, April 21st, 2018, 04:15:38 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రెండు వరుస పరాజయాల తరువాత నటించిన భరత్ అనే నేను నిన్న విడుదలై దుమ్ము రేపుతోంది. సినిమా విడుదల రోజే మహేష్ సత్తా చాటింది. ఏకంగా మొదటి రోజు 58 కోట్ల భారీ వసూళ్లతో దుమ్ము రేపాడు భరత్. ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ సాధించడంతో యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 23 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఈ వీకెండ్ లో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల మార్కెట్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు. మహేష్ యంగ్ ముఖ్యమంత్రి గా కనిపించడంతో అయన ఫాన్స్ ఓ రేంజ్ లో ఖుషి మీదున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments