వీడియో : భ‌ర‌త్ ఆ నాలుగు సీన్లు కేక‌

Sunday, May 6th, 2018, 12:00:13 PM IST

డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డివివి దాన‌య్య నిర్మించిన `భ‌ర‌త్ అనే నేను` ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ ప్ర‌స్తుతం ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్‌. 85ఏళ్ల టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఈ త‌ర‌హా ప్ర‌మోష‌న్ ఎవ‌రూ చేయ‌లేదు దాన‌య్యా అంటూ అంతా పొగిడేస్తున్నారు. ఇది నిజంగానే కొర‌టాల‌& డీవీవీ సంస్థ చేసిన గొప్ప ప్ర‌చారం. ప్ర‌తి గంట‌కు ఓ న్యూస్ బిట్ వ‌దులుతూనే ఉంది డివివి సంస్థ‌.

తాజాగా భ‌ర‌త్ అనే నేను చిత్రంలోని నాలుగు సీన్ల‌ను ఆన్లైన్‌లో వ‌దిలారు. ఇవ‌న్నీ అన్ క‌ట్ సీన్స్. రైతు స‌న్నివేశం, గ‌ర్భిణి స‌న్నివేశం, విద్యావ్య‌వ‌స్థ‌పై స‌న్నివేశం, అసెంబ్లీ స‌న్నివేశం.. ఇవ‌న్నీ యూట్యూబ్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ ప్ర‌య‌త్నం బావుంది. అస‌లు తెర‌వెన‌క ఒరిజిన‌ల్‌గా ఎలా తెర‌కెక్కిందో చూసుకునే వెసులుబాటు ఆడియెన్‌కి క‌ల‌గ‌డం గ్రేట్‌! నువ్వు కేక‌య్యా దాన‌య్యో!

  •  
  •  
  •  
  •  

Comments