రెండో భారతీయుడు ఇప్పట్లో రానట్టే .. కారణం అదేనా ?

Saturday, October 14th, 2017, 08:37:11 PM IST


ఈ మధ్య భారతీయుడు సీక్వెల్ రూపొందుతుందంటూ తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దానికి కారణం .. లేటెస్ట్ గా కమల్ హాసన్ షో లో దిల్ రాజు, శంకర్ లు కలవడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. అయితే దిల్ రాజు కూడా భారతీయుడు సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ !! ఈ సినిమాకోసం భారీ బడ్జెట్ వెచ్చించాల్సి రావడంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడట !! భారతీయుడు సీక్వెల్ రావాలంటే దాదాపు 300 కోట్ల బడ్జెట్ అవుతుందట ? భారతీయుడు2 సినిమాకోసం అంత బడ్జెట్ ఎందుకు ? అని షాక్ అవుతున్నారా ! ఆ వివరాల్లోకి వెళితే .. ఈ సినిమాకోసం శంకర్, కమల్ హాసన్ లకు చెరో యాభై కోట్లు ఇచ్చుకోవాలట రెమ్యూనరేషన్ కింద .. దాంతో పాటు భారతీయుడు మొదటి భాగానికి సంబందించిన పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ నిర్మాత ఏఎంరత్నం కు రాయల్టీ హక్కుల కింద 25 కోట్లు ? ఇక మిగతా సాంకేతిక నిపుణులు .. సినిమా షూటింగ్ ఖర్చు మొత్తం కలిసి మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. సో దిల్ రాజు ఒక్కడే అంత రిస్క్ తీసుకుంటాడా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా రాయల్టీ హక్కుల విషయంలో సదరు నిర్మాత ఏకంగా పాతిక కోట్లు డిమాండ్ చేయడంతో దిల్ రాజు వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. హక్కులకు ఈ రేంజ్ అంటే సినిమా మొత్తం పూర్తయితే తడిసి మోపెడవం ఖాయం కాబట్టి ఈ ప్రయత్నాన్ని దిల్ రాజు పక్కన పెట్టాడని టాక్ ?

  •  
  •  
  •  
  •  

Comments