వేగం పెంచిన .. రెండో భారతీయుడు ?

Tuesday, September 4th, 2018, 07:59:23 PM IST

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారతీయుడు 2 కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అయన హెలికాఫ్టర్ లో లొకేషన్ అన్వేషణ చేశారు. అప్పట్లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు శంకర్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం అయన రజని కాంత్ తో రోబో 2. 0 తెరకెక్కించాడు .

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా గ్రాఫిక్ పనుల్లో ఉంది .. అందుకే సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉండడంతో శంకర్ భారతీయుడు 2 సీక్వెల్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తాడట. నేటి పరిస్థితులతో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ విలన్ గా నటించే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. నయనతార ఎంపిక అయితే ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

  •  
  •  
  •  
  •  

Comments