తమిళనాట ‘భరత్ అనే నేను’ ప్రభంజనం!

Tuesday, May 8th, 2018, 04:15:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో, బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా, డివివి దానయ్య నిర్మించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘భరత్ అనే నేను’. విడుదలయిన ఈ చిత్రం ఫస్ట్ ఓత్ నుండి చిత్రం పై ప్రేక్షకుల్లో, అటు మహేష్ అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత విడుదలయిన టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ కూడా చిత్రం పై అంచనాలను మరింత పెంచాయి. భరత్ ప్రామిస్ చేసినట్లుగానే ఏప్రిల్ 20 న విడుదలయిన ఈ సినిమా విడుదలయిన అన్ని చోట్ల నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ఇప్పటికీ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మంచి కలెక్షన్ట్లతో సాగుతున్న ఈ చిత్రం తమిళనాడులో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మన హీరోలు ఇదివరకు ఇతర రాష్ట్రాలపై అంతగా శ్రద్ధ పెట్టేవారు కాదనే ఒక విమర్శ ఉండేది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ మలయాళం లో మల్లు అర్జున్ గా మంచి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇకపొతే మహేష్ బాబు కూడా స్పైడర్ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలో కూడా తీసి విడుదల చేసాడు. ఆ చిత్రం అక్కడ పెద్దగా ఆడనప్పటికీ, మహేష్ నటనకు మంచిపేరు రావడమే కాక అక్కడ ఆయనకు సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ తీసుకొచ్చింది.

ఇక ప్రస్తుతం విడుదలైన భరత్ అనే నేను తమిళనాడులో మొత్తం రూ.4.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఇప్పటిదాకా ఏ తెలుగు చిత్రం కూడా ఇంతటి కలెక్షన్ రాబట్టలేదని, బాహుబలి మొదటిభాగం బాగా ఆడినప్పటికీ ఈ స్థాయి కలెక్షన్ తెచుకోలేదని అంటున్నారు. ఇప్పటివరకు తమిళనాడులో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు లాభాలతో పండుగ చేసుకుంటున్నారట. ఈ చిత్రం కేవలం చెన్నయ్ నగరంలో రూ. 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని, ఇది ఒకరకంగా చెన్నైలో తెలుగు చిత్రాలన్నిటిలో పెద్ద రికార్డ్ అని అంటున్నారు. మరి మున్ముందు భరత్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి……

Comments