భరత్ కు బాగానే వర్కవుట్ అయిందిగా ?

Thursday, May 17th, 2018, 10:13:47 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను గత నెల 27న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా భారీ వసూళ్లు అందుకుంది. ఈ సినిమా కేవలం 25 రోజుల్లో 205 కోట్ల గ్రాస్ ని రాబట్టి మహేష్ స్టామినా ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో 65. 32 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.

మహేష్ కెరీర్ లోనే అత్యదిగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీమంతుడు లాంటి హిట్ సినిమా తరువాత క్రేజీ దర్శకుడు కొరటాలతో చేసిన ఈ సినిమా కూడా సంచలన విజయం అందుకోవడంతో ఈ కంబినేషన్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి తో సినిమా చేయనున్నాడు. ఈ నెల చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.