భారీ హిట్ దిశగా “భరత్ అనే నేను”

Friday, April 27th, 2018, 11:52:06 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ భరత్ అనే నేను. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా తొలి రోజునుండి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టే దిశగా నడుస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లోను తన కలెక్షన్ల స్టామినా ను చూపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లాప్ చిత్రాలు కూడా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు సాధించాయంటే ఆయనకీ అక్కడ వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అర్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా యుఎస్ ఏ లోఐదు రోజులకు గాను, ప్రీమియర్ల కలెక్షన్లను కలుపుకుని రూ. 17.91 కోట్లు కొల్లగొట్టి రూ.20 కోట్లకు పరుగులు తీస్తోంది,

అలానే ఆస్ట్రేలియా లో కూడా ఐదు రోజుల్లో రూ. 2.02 కోట్ల వసూళ్లు అందుకున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ తన ఆదర్శ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో వెల్లడించారు. అలానే కేరళ లోను ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది,ఇప్పటివరకు అక్కడ ఈ సినిమా రూ.7.63 లక్షలు కలెక్ట్ చేసినట్లు చెపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా మొత్తంగా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఐదు రోజులకే ఇంత కలెక్ట్ చేస్తే, మున్ముందు రోజుల్లో భరత్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments