అక్కడ భరత్ కు బాగానే వర్కవుట్ అయిందిగా ?

Thursday, April 26th, 2018, 10:47:08 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా చెప్పినట్టే సూపర్ డూపర్ హిట్ కొట్టేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో అయన నటించిన భరత్ అనే నేను సినిమా అన్ని కేంద్రాల్లో దూసుకుపోతుంది. ఇప్పటికే సౌత్ లో మొదటి రోజు వసూళ్ళలో టాప్ టెన్ లో స్తానం సంపాదిస్తుంచుకున్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో భరత్ క్రేజ్ కి ఓవర్ సీస్ మార్కెట్ ఫిదా అయింది. ఈ సినిమా కేవలం రెండో వారాల్లో 2. 6 మిలియన్స్ ( 17 కోట్లు ) వసూలు చేసింది. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో భారీ వసూళ్లు అందుకున్న చిత్రంగా భరత్ అనే నేను రికార్డు క్రియేట్ చేసింది. ఇక భరత్ ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను దాటి 150 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తుంది. మహేష్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటు క్రేజ్ తో పాటు బారి వసూళ్లతో దుమ్ము రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments