వివాదంలో చిక్కుకున్న భరత్ అనే నేను!

Thursday, May 10th, 2018, 05:22:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను. గత నెల 20న విడుదలయి సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం కనపడుతోంది. మహేష్ బాబు అద్త్బుతమైన నటన, దర్శకుడు కొరటాల దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరసి ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ రేంజ్ లో కూర్చోపెట్టాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంతవరకు బానే వున్నా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఈ చిత్రంలో వాడిన నవోదయం పార్టీ పేరు, గుర్తు తమవే అని దాసరి రాము అనే వ్యక్తి అంటున్నారు.

అంతే కాదు తమ పార్టీకి ఎన్నికలగుర్తు కూడా ఉందని, అలాంటిది మానుండి ఎటువంటి అనుమతి లేకుండా మా పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాను చిత్ర దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. అయితే ఇదివరకు మహేష్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం శ్రీమంతుడు కూడా ఇలాంటి ఒక వివాదం లో ఇరుక్కుంది. ఆ చిత్రం కథ తనదేనని, కొరటాల తన అనుమతి లేకుండా నా చచ్చేంత ప్రేమ అనే నవలని శ్రీమంతుడు చిత్రంగా తెరకెక్కించారని అప్పట్లో శరత్ చంద్ర అనే వ్యక్తి మా అసోసియేషన్ లో, అలానే కోర్ట్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భరత్ అను నేను విషయంలో తలెత్తిన ఈ వివాదాన్ని యూనిట్ ఈలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి……..

  •  
  •  
  •  
  •  

Comments