200 కోట్ల క్లబ్ లోకి భరత్ అనే నేను!

Thursday, May 10th, 2018, 03:16:32 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం భరత్ అనే నేను. ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏఈ చిత్రం తొలిరోజునుండే సూపర్ హిట్ టాక్ తో రన్అవుతోంది . మహేష్ బాబు ఇందులో వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించింది. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి రెండు పరాజయాల తర్వాత ఇంత పెద్ద హిట్ అందుకున్న మహేష్ బాబు కెరీర్ లోనే ఎంతో సంతోషం అనుభవిస్తున్నానని ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా ఈ చిత్రం నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని సినీ విశ్లేషకులుచెపుతున్నారు. బాహుబలి చిత్రాల్ని మినహాయిస్తే ఇప్పటికే ఇదే మొత్తం గ్రాస్ కలెక్షన్లనురాబట్టిన తొలి చిత్రంగా రాంచరణ్, సుకుమార్ ల కలయికలో వచ్చిన రంగస్థలం నిలిచినా విషయం తెలిసిందే. కాగా భరత్ అనే నేను ప్రస్తుతం రంగస్థలం తర్వాత ఆ రికార్డును అందుకున్న చిత్రంగా నిలిచింది. కేవలం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఓవర్సీస్ లోనేకాక తమిళనాడులో కూడా మహేష్ తన కలెక్షన్ల ప్రభంజనాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట నాన్ బాహుబలి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో వేచిచూడాలి…….