మాలీవుడ్‌లో బ‌న్నిని మించి మ‌హేష్‌?

Saturday, May 26th, 2018, 11:03:26 AM IST

మే 31న మాలీవుడ్‌లో భ‌ర‌త్ హ‌వా
టాలీవుడ్ స్టార్ హీరోలు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు త‌మ గ్రాఫ్‌ని ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో విస్త‌రించేందుకు పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌కి మాలీవుడ్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. మ‌ల్లూ అర్జున్‌గా అక్క‌డ పాపుల‌ర్‌. ఆ క్ర‌మంలోనే చ‌ర‌ణ్‌, మ‌హేష్ వంటి స్టార్లు అక్క‌డ పాపులారిటీ పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

మొన్న‌టికి మొన్న మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` తెలుగు వెర్ష‌న్ బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద 200కోట్ల వ‌సూలు చేసింది. ఇప్పుడు మాలీవుడ్‌లో అనువాదాన్ని రిలీజ్ చేస్తున్నారు. అక్క‌డ ప్ర‌ఖ్యాత నిర్మాత శిబు త‌మీన్స్ .. భ‌ర‌త్ రిలీజ్‌కి సాయం చేస్తున్నారు. శిబు మ‌ల‌యాళంలో ఫేమ‌స్ ప్రొడ్యూస‌ర్ కం పంపిణీదారు కావ‌డంతో మ‌హేష్ సినిమాకి బిజినెస్ బాగానే సాగింద‌ని చెబుతున్నారు. శిబు ఇదివ‌ర‌కూ తెర‌కెక్కించిన `మ‌న్యం పులి` (పులి మురుగ‌న్‌) బంప‌ర్ హిట్ కొట్టి 100కోట్ల క్ల‌బ్‌లో చేరింది. సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ నిర్మాతగా శిబుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆ క్ర‌మంలోనే భ‌ర‌త్ అనే నేను మ‌ల‌యాళ వెర్ష‌న్‌ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారాయ‌న‌. ఈ స‌న్నివేశం చూస్తుంటే మ‌హేష్‌కి మాలీవుడ్‌లోనూ అసాధార‌ణ ఫాలోయింగ్ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments