100 రోజులకి చేరువలో ‘భరత్ అనే నేను’!

Thursday, July 26th, 2018, 09:00:21 PM IST


శ్రీమంతుడు సూపర్ హిట్ తరువాత మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవంతో రెండేళ్ల నుండి ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో వున్నారు. హిట్ కోసం మాంచి ఆకలి మీదున్న మహేష్ అభిమానులకు శ్రీమంతుడు వంటి హిట్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ, ఈ సారి కసితో తెరకెక్కించిన సినిమా భరత్ అనే నేను. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో ముఖ్యమంత్రి పాత్రా పోషించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఈ చిత్రంలో ఆయనకు జోడి గా నటించింది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా పలికిన డైలాగులు, కైరా అందాలు, అభిమానులకు కావలసిన ఫైట్స్,

ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, వినసొంపైన పాటలు మరియు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వెరసి చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసాయి. ఇక విడుదలయిన తొలి రోజునుండి ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతూ ప్రస్తుతం 100 రోజులకు చేరువలో వుంది. కాగా ఎల్లుండి, అంటే జులై 28న ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆ వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయంతో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు ప్రస్తుతం దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలుగా, వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్ లోని ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం రానున్న వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది….

  •  
  •  
  •  
  •  

Comments