సెన్సార్ కు వెళ్లనున్న భరత్ ?

Friday, April 13th, 2018, 09:55:47 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివల కాంబినేషన్ లో శ్రీమంతుడు సూపర్ హిట్ తరువాత రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తీ చేసుకుని సెన్సార్ కు సిద్ధం అయింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 20 న విడుదలకు సిద్ధం అయినా నేపథ్యంలో వేగంగా సినిమాకు సంబందించిన కార్యక్రమాలు పూర్తీ చేసారు. ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే టాలీవుడ్ ఆసక్తి నెలకొంది. మహేష్ ముఖ్యమంత్రి గా కనిపిస్తున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మరి ఈ రోజు సెన్సార్ పూర్తీ చేసుకున్నాడంటే ఇక భరత్ హంగామాకు అడ్డే లేదన్నమాట.