తమిళ్ లో విడుదలకు రెడీ అయిన భరత్ అనే నేను!

Wednesday, May 16th, 2018, 12:13:14 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన, కొరటాల మార్క్ మేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, రవి కే చంద్రన్, తిరు ల ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎమ్ఎస్ ధోని ఫేమ్ కైరా అద్వానీ ఈ చిత్రంలో మహేష్ సరసన జోడి కట్టిన విషయం తెలిసిందే. కాగా డివివి దానయ్య చిత్రాన్ని ఎక్కడా కంప్రమైజ్ కాకుండా మంచి సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఇటీవల రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుని ఇంకా స్టడీగానే సాగుతోంది.

మరోవైపు ఈ చిత్రం తమిళనాడులో అతిపెద్ద ప్రభంజనమే సృష్టించిందని చెప్పాలి. మహేష్ గత చిత్రం స్పైడర్ ఏకకాలంలో తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మహేష్ కు తమిళ్ లో మంచి ఆరంభం దొరకలేదని చెప్పాలి. అయితే అది ఒకరకంగా మహేష్ కు మంచే చేసింది. ప్రస్తుతం భరత్ అనే నేను అక్కడ విడుదలయి మంచి టాక్ సంపాదించడంతో ఒక్కసారిగా మహేష్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే అక్కడ ఈ చిత్రం దాదాపు రూ.4 కొట్ల వరకు వసూలు చేసిందని, ఇప్పటివరకు తమిళనాడులో విడుదలయిన అన్ని తెలుగు చిత్రాల కలెక్షన్ల కంటే ఇది అధికమని అక్కడి సినీ విశ్లేషకులు చెపుతున్నారు.

మరొక అతి ముఖ్యవిషయం ఏమిటంటే, కేవలం చెన్నై నగరంలోనే ఈ చిత్రం రూ.1.65 కోట్ల కలెక్షన్ పొందింది. దీన్ని బట్టి చూస్తే మన సూపర్ స్టార్ కి అక్కడి ప్రేక్షకులు ఎంత ఫిదా అయ్యారో అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు చిత్ర నిర్మాత ఈ చిత్రాన్ని మే 25న తమిళ్ లో డబ్ చేసి భరత్ యనుమ్ నాన్ పేరుతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు వర్షన్లోనే మహేష్ తన సత్తా ఈ విధంగా చూపితే ఇక తమిళ వర్షన్ లో ఏమేరకు విజయం అందుకుంటాడా వేచి చూడాలి మరి……..