తమిళ మార్కెట్ పై కన్నేసిన భరత్ ?

Saturday, May 12th, 2018, 10:41:07 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు .. ఓవర్ సీస్ లో కలిపి ఏకంగా 200 కోట్ల వసూళ్లు అందుకుని దుమ్ము రేపింది. ఇక తమిళనాడు లో కూడా తెలుగు వెర్షన్ కు మంచి వసూళ్లు దక్కాయి. చెన్నై లోనే భారీగా వసూళ్లు అందుకున్న తెలుగు సినిమాగా సంచలనం రేపింది. దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో విడుదల చేస్తే ఇంకా భారీ వసూళ్లు అందుకునే వీలు ఉందన్న ఆలోచనలో భాగంగా ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహేష్ సరసన ఖైదా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళ విడుదల డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారాట. అన్నట్టు ఈ చిత్రాన్ని తమిళంలో కూడా డివివి దానయ్య డబ్ చేస్తున్నాడు .

  •  
  •  
  •  
  •  

Comments