భ‌ర‌త్ సీక్వెల్ ప‌ని సైలెంటుగానే..!?

Friday, July 27th, 2018, 03:40:24 PM IST

సినిమాలు స‌మాజంలో మార్పు తెస్తాయా? అంటే అబ్బే.. అస్స‌లు సినిమా వాళ్ల‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అంటూ తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ ఇటీవ‌లి కాలంలో సినిమాల ప్ర‌భావం స‌మాజంపై ఎంత‌గా ఉంటుందో చెప్పేందుకు మొన్న‌టి పార్ట‌మెంట్ డిస్క‌ష‌న్స్ ప‌రిశీలించి చూడాలి. ఇటీవ‌ల పార్ల‌మెంట్ స‌మావేశంలో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సాక్షిగా `భ‌ర‌త్ అనే నేను` సినిమా గురించి, రాజ‌కీయాల్లో అవ్య‌వ‌స్థ గురించి చ‌ర్చ సాగ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తించింది.

అవినీతి రాజ‌కీయాల్ని క‌డిగేయాల్సిన అవ‌స‌రాన్ని ప‌క్కాగా చూపించ‌డంలో కొర‌టాల అండ్ టీమ్ పెద్ద స‌క్సెసైంది. అందుకే `భ‌ర‌త్ అనే నేను` అంత పెద్ద హిట్ట‌య్యింద‌ని చెప్పొచ్చు. ఇక పార్ల‌మెంటులో భ‌ర‌త్ గురించిన ప్ర‌స్థావ‌న‌పై మ‌హేష్ ఏ మాటా మాట్లాడ‌లేదు కానీ, న‌మ్ర‌త మాత్రం త‌న‌దైన శైలిలో స్పందించారు. అలాంటి చోట ఓ సినిమా గురించి మాట్లాడ‌డం అంటే పెద్ద విష‌య‌మేన‌ని, స‌మాజంపై సినిమా ప్ర‌భావానికి ఇది సింబాలిక్ అని అన్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు కొర‌టాల సీక్రెట్‌గా ప‌ని మొద‌లు పెట్టేశాడ‌ట‌. సైలెంటుగా స్క్రిప్టు వ‌ర్క్ న‌డుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు ఎవ‌రూ. భ‌ర‌త్ అనే నేను సీక్వెల్ గురించి టాలీవుడ్ లో కంటే అటు బాలీవుడ్‌లో ఎక్కువ చ‌ర్చ సాగుతుండ‌డం, బాలీవుడ్ వెబ్‌సైట్లు పేర్కొన‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments