భారీ లెవెల్లో ‘భరత్ అనే నేను’ పాట షూటింగ్

Sunday, March 18th, 2018, 05:13:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో, డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య నిర్మాతగా ఆయన నటిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ ఓత్, అలానే ఫస్ట్ విజన్ సూపర్ హిట్ అయ్యాయి. అంతే కాక ఫస్ట్ విజన్ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక లైక్ లు పొందిన టీజర్ గా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. కాగా నేడు ఉగాదిని పురస్కరించుకుని విడుదల చేసిన మహేష్ పంచెకట్టు పోస్టర్ కు అద్భుత స్పందన లభించింది. విడుదలైన ఈ పోస్టర్ తో సూపర్ స్టార్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.

నేడు సినిమా ప్రోగ్రెస్ గురించి నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం మా సినిమాకు సంబంధించి ఓ పాట రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు. భారీ టెంపుల్ సెట్‌లో 100 మంది డ్యాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్ లెవల్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారని చెప్పారు. అలానే ఈ నెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్ ఉంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అనుకున్నట్లు ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల చేస్తామని అన్నారు. కాగా, ఈ సినిమాను మహేశ్ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు….