భరత్ కథ నాదే .. కొనలేదంటున్న కొరటాల శివ ?

Sunday, April 15th, 2018, 04:24:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ తేగ షికార్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమా కథను దర్శకుడు కొరటాల శివ కోటి రూపాయలకు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై కొరటాల పలుమార్లు ఈ కథ నాదే అంటూ చెప్పాడు .. అయినా వార్తలు ఆగలేదు .. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అయన స్పందిస్తూ భరత్ అనే నేను కథ నాదే అని .. ఎవరి దగ్గర కొనలేదని స్పష్టం చేసాడు. నా స్నేహితుడు హీరోని ముఖ్యమంత్రి గా చూపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఈ కథను సిద్ధం చేసానని చెప్పేసాడు. సో భరత్ అనే నేను కథ .. నాది అంటూ ఎవరు వివాదం రేపొద్దు మరి.