వచ్చాడోయ్ సామి .. అంటూ అదరగొట్టేన మహేష్ ?

Friday, April 6th, 2018, 02:00:52 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమానుండి ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తున్నారు. తాజాగా వచ్చాడోయ్ సామి అంటూ సాగే సాంగ్ ని నిన్న సాయంత్రం విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించాడు. అద్భుతమైన లిరిక్స్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ఒక్క రోజులో ఏకంగా 2 మిలియన్ వ్యూస్ సాధించి దుమ్ము రేపింది. ఈ సాంగ్ లో మహేష్ పంచెకట్టుతో అదిరిపోయేలా డాన్స్ చేసి మెప్పించేసాడు. మొత్తానికి భరత్ అనే నేను సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments