మహేష్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!

Wednesday, May 2nd, 2018, 03:17:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన లేటెస్ట్ సెన్సేషన్, భరత్ అనే నేను. ఐతే ఈ చిత్రం విషయమై ఇటీవల టాలీవుడ్ లో పవన్ ని ఉద్దేశించి అనుచిత్య వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో, మహేష్ బాబుని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నిజానికి కొద్దిరోజులక్రితం ఆమె ఈ చిత్ర దర్శకుడు కొరటాలశివతో చేసిన చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను, అసలు ఈ సినిమా సూపర్ హిట్ కానేకాదు, ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అని, కేవలం మహెష్ క్రేజ్ వల్లనే ఆ టాక్ వచ్చిందని అంటోంది. కొరటాలది చెత్త డైరెక్షన్ అని, ముఖ్యంగా మహేష్ బాబు ఫేస్ లో ఎక్సప్రెషన్ లేని స్టార్ గా తయారవుతున్నారని ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన వెంటనే మహేష్ ఫాన్స్ ఆమెపై ట్వీట్ల దాడి మొదలెట్టారు. కాగా కొద్దీసేపటికి ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసింది…….