బ్రేకింగ్ న్యూస్ : 100 కోట్ల క్ల‌బ్‌లో `భ‌ర‌త్ అనే నేను`

Sunday, April 22nd, 2018, 12:24:26 PM IST

ఇది క‌నీవినీ ఎరుగ‌నిది. అసాధార‌ణ‌మైన‌ది. నాన్ బాహుబ‌లి కేటగిరీలో ఇదో సంచ‌ల‌నం అనే చెప్పాలి. డే-1లోనే 50కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టామ‌ని భ‌ర‌త్ అనే నేను టీమ్ ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌వైడ్ 50కోట్ల‌ గ్రాస్ వ‌సూలు చేసింద‌ని స‌మాచారం అందింది. అదో షాకింగ్ న్యూస్ అనుకుంటుండ‌గానే 100 కోట్ల క్ల‌బ్ వార్త అందింది.

మూడో రోజు మ‌ధ్యాహ్నానికి 100 కోట్ల క్ల‌బ్ లో సీఎం భ‌ర‌త్ చేరిపోయాడు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ 100 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాం అంటూ ట్విట్ట‌ర్‌లో అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. 100 కోట్ల వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాస్ కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే ఎలా సాధ్యం?.. వ్వాటే మిరాకిల్‌. ఇలాంటివి అరుదుగానే సాధ్యం. భ‌ర‌త్ సునామీ ముందు ఇక ఎవ‌రూ నిల‌వ‌డం క‌ష్ట‌మే.

  •  
  •  
  •  
  •  

Comments