150 కోట్లు వ‌సూలు చేస్తేనే హిట్టు!?

Tuesday, April 24th, 2018, 09:55:46 PM IST

మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` 100 కోట్ల గ్రాస్, దాదాపు 59 కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఇందులో వాస్త‌వ‌మెంత‌? అంటే కాస్త అటూ ఇటూగా వాస్త‌వమేన‌ని ప్ర‌ఖ్యాత ఆంధ్రా బాక్సాఫీస్ గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌హేష్ `శ్రీ‌మంతుడు` తొలి వారం రికార్డుల్ని, కేవ‌లం తొలి వీకెండ్‌లోనే భ‌ర‌త్ అందుకున్నాడు. మ‌హేష్ కెరీర్ బెస్ట్ 2 ఫిలింగా ఇప్ప‌టికే భ‌ర‌త్ అనే నేను రికార్డుల‌కెక్కింది. అయితే ట్రేడ్ లో వినిపిస్తున్న మాట ప్ర‌కారం.. భ‌ర‌త్ అనే నేను దాదాపు 140 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్‌, 100 కోట్ల షేర్ వ‌సూలు చేస్తేనే హిట్టు కొట్టిన‌ట్టు. అంత‌కుమించి వసూలు చేస్తే బంప‌ర్ హిట్ కింద లెక్క‌. అల్లు అర్జున్‌ `నా పేరు సూర్య‌` రిలీజ్‌ వ‌ర‌కూ వ‌సూళ్ల కు ఢోకా ఉండ‌దు. అలానే వేస‌వి సెల‌వులు.. స్టూడెంట్స్ ఓవ‌ర్‌ఫ్లో మ‌హేష్ సినిమాకి క‌లిసి రానుంది.

ఇక 3రోజుల్లో షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే… నైజాం – 10.2 కోట్లు, సీడెడ్‌- 5.5 కోట్లు, తూ.గో జిల్లా-4.42కోట్లు, ప‌.గో జిల్లా-2.6 కోట్లు, కృష్ణ‌-3.38 కోట్లు, గుంటూరు-5.57కోట్లు, నెల్లూరు-1.42కోట్లు, ఏపీ -నైజాం క‌లుపుకుని 38.3కోట్లు వ‌సూలైంది. అమెరికా -9.08కోట్లు, క‌ర్నాట‌క -5.8కోట్లు, యుఏఈ/గ‌ల్ఫ్‌- 1.35కోట్లు, త‌మిళ‌నాడు -87ల‌క్ష‌లు, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ గంప‌గుత్త‌గా -90ల‌క్ష‌లు, ఇత‌ర‌చోట్ల 1.1కోట్లు వ‌సూలైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 57.4కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కాయి. ఏపీ, నైజాం ఓవ‌రాల్ గ్రాస్ -38కోట్లు క‌లుపుకుని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 93కోట్ల గ్రాస్ ని ఆంధ్రా బాక్సాఫీస్ ప్ర‌క‌టించింది.

  •  
  •  
  •  
  •  

Comments