భరత్ వసూళ్లు ఫేక్ కాదంటున్న నిర్మాత?

Sunday, April 29th, 2018, 09:38:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన భరత్ అనే నేను సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకుంటూ దూసుకుపోతుంది. మొదటి వారంలోనే 161 కోట్ల గ్రాస్ వచ్చిందని యాడ్ కూడా విడుదల చేసారు. అయితే ఈ సినిమా కలక్షన్స్ విషయంలో పలు కామెంట్స్ వస్తున్నాయి. భరత్ కలక్షన్స్ ఫేక్ అని, కావాలనే తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నారని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చారు. భరత్ అనే నేను సినిమాకు సంబందించిన వసూళ్లు నిజమే అని .. వాటిని నేనే స్వయంగా ప్రకటించానని అయన చెప్పారు. మొదటి వారంలో 161. 28 కోట్ల గ్రాస్ వచ్చిందని తెలిపారు. నిన్న సాయంత్రం ఈ సినిమా సక్సెస్ సంబరాలను హైద్రాబాద్ లో జరుపుకున్నారు. తన కెరీర్ లోనే భరత్ సూపర్ హిట్ సినిమాగా నిలిచిందని. ఈ సినిమా సక్సెస్ తో తన రేంజ్ కూడా మారిందని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments