ముఖ్యమంత్రికి స్పెషల్ షో పర్మిషన్ దొరికేసింది ?

Wednesday, April 18th, 2018, 10:58:26 PM IST


ఏంటి ముఖ్యమంత్రి ఎవరా ? అని షాక్ అవుతున్నారా .. ఇంకెవరు .. సూపర్ స్టార్ మహేష్ బాబు .. !! అయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటీకే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా విడుదలకు ముందు స్పెషల్ షో పర్మిషన్ పొందింది. ఈ నెల 20 నుండి 27 వరకు అదనపు షో లు వేసుకోవొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఇక తెలంగాణాలో కూడా పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ ముఖ్యమంత్రి గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ భామ ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. బిజినెస్ వార్తల్లో కూడా ఆసక్తి రేపిన ఈ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments