స్పైడర్ నష్టాలకు భరత్ సాయం?

Wednesday, January 24th, 2018, 02:08:17 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో గత సంవత్సరం భారీ అంచనాలతో విడుదలయిన స్పైడర్ సినిమా ఘోర పరాజయాన్ని అందుకున్న విషయం మనకి అందరికి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 50 కోట్ల మేర నష్టాలను మిగిల్చినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రం ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లకు కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏకంగా మహేష్ బాబు రంగంలోకి దిగారట. ముఖ్యంగా స్పైడర్ నైజాం హక్కులను కొన్న దిల్ రాజు కి చాలా నష్టం రావడంతో తన తదుపరి చిత్రం భరత్ అనే నేను (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని క్రేజ్ ఎక్కువగానే ఉన్నప్పటికి కాస్త తక్కువ ధరకు అమ్మమని నిర్మాత దానయ్యకు సూచించినట్లు, అలానే తన 25వ చిత్రం దిల్ రాజు బ్యానర్ లో చేయబోతుండడంతో మిగతా లెక్కలు తర్వాత చూసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారట. దిల్ రాజు మాదిరిగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు అందరికి ఇదే విధమైన పద్దతిని అనుసరించాలని మహేష్ బాబు సూచించారని, ఇలా చేయడం వల్ల నష్టపోయినవాళ్ళు పోగొట్టుకున్నది మొత్తం అంతా తిరిగి రాకపోయినా చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం కనపడుతోందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ మొత్తం వ్యవహారం కు సంబందించిన అన్ని సెటిల్మెంట్లు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పద్దతిలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తన చిత్రాల ద్వారా నష్టపోయిన నిర్మాతలకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం, అలానే నష్టపోయిన అదే నిర్మాతలకు తదుపరి చిత్రం ఫ్రీ గా చేయడం వంటివి చేసి తన దాతృత్వాన్ని చాటుకునేవారు. తండ్రి లానే ఇప్పుడు తనయుడు కూడా ఈ విధమైన పద్ధతికి శ్రీకారం చుట్టడం చిత్ర పరిశ్రమకు శుభపరిణామంగా పలువురు కొనియాడుతున్నారు….