‘భరత్’ సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీ!!

Monday, March 12th, 2018, 04:20:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో, కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఇప్పటికే బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి చిత్రాలతో రెండు వరుస ప్లాప్ లు అందుకున్న మహేష్ బాబు ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని దృఢ సంకల్పంతో వున్నారు. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటికే కొత్త తరహా ప్రచారంతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఓథ్, విజన్ ఆఫ్ భరత్ లాంటి పేర్లతో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించారు. ఇలాంటివి మరిన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఇవన్నీ ఒకెత్తయితే, తాజాగా యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయం మరో ఎత్తు. అవును, భరత్ అనే నేను సినిమాకు ఏకంగా 20 రోజుల పాటు ఎక్స్ క్లూజివ్ గా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారట. ఏప్రిల్ 1నుంచి సినిమా విడుదలైన రోజు వరకు ఏదో ఒక రూపంలో ఈ సినిమాకి ప్రచారం కల్పించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు 20 రోజులకు సరిపడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసిందట యూనిట్. ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయబోతున్నారు. తన ప్లాప్ లకు ప్రధాన కారణం అయిన తనకు సరైన సోషల్ మీడియా టీం లేకపోవడమేనని తెలుసుకున్న సూపర్ స్టార్, ఈ మధ్య తన సోషల్ మీడియా టీమ్ ను పక్కాగా సిద్ధం చేశారు.

కొత్త టీం వచ్చిన తర్వాత సరికొత్త ప్రచార కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. వాళ్ల ఆధ్వర్యంలోనే 20 రోజుల పాటు పలు యాక్టివిటీస్ నిర్వహించబోతున్నారు. మరోవైపు రెగ్యులర్ గా ఉండే ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీరిలీజ్ ఫంక్షన్లు లాంటి కార్యక్రమాలకు కూడా అదనంగా మరికొన్ని ప్లాన్ చేశారు. ఇవన్నీ చేయాలంటే ఈ నెలాఖరుకు భరత్ అనే నేను సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలా అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి నూతన తరహా కార్యక్రమాల వాళ్ళ ఖచ్చితంగా సినిమా విజయంలో కీలకపాత్ర వహిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది….