భ‌ర‌త్ హ‌వా : ఓవ‌ర్సీస్ నుంచి జ‌స్ట్‌ 31 కోట్లు

Friday, April 27th, 2018, 09:36:19 PM IST

రీల్ సీఎం భ‌ర‌త్ ఇంటా బ‌య‌టా విప‌రీతంగా న‌చ్చేశాడు. భ‌ర‌త్ సార్ ఎక్క‌డికి వెళ్లినా వ‌స్తున్న రెస్పాన్స్‌ను బ‌ట్టి ఇది అంచ‌నా వేయొచ్చు. డివివి సంస్థ ఓవైపు 160 కోట్ల గ్రాస్ ప్ర‌క‌టిస్తే, అందులో విదేశాల నుంచి వ‌చ్చిన మొత్తం క‌ళ్లు భైర్లు క‌మ్మేలా ఉంది. భ‌ర‌త్ అనే నేను కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచి 31 కోట్లు వసూలు చేసింది. అంటే 130 కోట్ల గ్రాస్‌ తెలుగు రాష్ట్రాల నుంచి వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది.

తొలి వారం నుంచి రెండో వారంలో అడుగుపెట్టిన వేళ డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అందించిన తాజా ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ఇదీ… అమెరికా, ఆస్ట్రేలియా, యూర‌ప్‌, ఆఫ్రికా, మ‌లేషియా .. ప్ర‌తిచోటా భ‌ర‌త్ హ‌వా సాగింది. కేవ‌లం ఉత్త‌ర అమెరికా నుంచి 3015 కె డాల‌ర్లు వ‌సూల‌వ్వ‌గా, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ నుంచి 535 కె డాల‌ర్లు, యూర‌ఫ్ నుంచి 350కె డాల‌ర్లు వ‌సూల‌య్యాయి. ఆఫ్రికా- మ‌లేషియా- సింగ‌పూర్‌- త‌దిత‌ర చోట్ల నుంచి 150కె డాల‌ర్లు వ‌సూలైంది. గ‌ల్ఫ్ దేశాల నుంచి మ‌రో 600 కె డాల‌ర్లు క‌లెక్ట‌యింది. ఓవ‌రాల్‌గా విదేశీ బాక్సాఫీస్ వ‌ద్ద 31.06 కోట్ల (4.61 మిలియ‌న్ డాల‌ర్లు) గ్రాస్ న‌మోదైంది. అంటే ఓవ‌ర్సీస్ మార్కెట్ ఎంత పెద్ద రేంజుకు ఎదిగిందో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

  •  
  •  
  •  
  •  

Comments