ఆస్ట్రేలియాలో భ‌ర‌త్ షాకింగ్ క‌లెక్ష‌న్స్‌!

Saturday, April 21st, 2018, 11:27:31 PM IST

మ‌న సినిమాకి ఏపీ, నైజాం వసూళ్లు స‌ర్వ‌సాధార‌ణం. అమెరికాను నైజాం అంత ప‌వ‌ర్‌ఫుల్‌ మార్చెట్‌గా మ‌లుచుకున్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో, జ‌పాన్‌లోనూ రిలీజ్ చేసి మ‌న హీరోలను అక్క‌డ లోక‌ల్ జ‌నాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. అయితే వీట‌న్నిటికీ దూరంగా వ‌ర‌ల్డ్ మ్యాప్‌లో ఎక్క‌డో క‌నిపించే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ మ‌న హీరోల‌కు మార్కెట్ ఏర్ప‌డ‌డం ఆస‌క్తి పెంచుతోంది. అంత‌కంత‌కు వ‌ర‌ల్డ్‌వైడ్ పెరుగుతున్న ఇండియ‌న్ డ‌యాస్పోరా(మ‌నోళ్లు)కు సింబాలిక్ అనే చెప్పాలి.

ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మార్కెట్ లోనూ మ‌న సినిమాలు రిలీజై స‌క్సెస్ సాధిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న రంగ‌స్థ‌లం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అద్భుత వ‌సూళ్లు సాధించింది. సేమ్ రిజ‌ల్ట్‌ను `భ‌ర‌త్ అనే నేను` అందుకుంది. ఆస్ట్రేలియాలో డే1 ప్రీమియ‌ర్లు క‌లుపుకుని 85ల‌క్ష‌ల‌ వ‌సూళ్లు సాధించింది ఈ చిత్రం. దాదాపు 35 లొకేష‌న్ల నుంచి 168కె ఆస్ట్రేలియా డాల‌ర్లు వ‌సూలైంది. చెన్న‌య్ నుంచి డే-1లో 27ల‌క్ష‌లు వ‌సూలు చేసింద‌న్న స‌మాచారాన్ని బట్టి, అంత‌కు మూడు రెట్లు అద‌నంగా వ‌సూలు చేసిన‌ట్టే లెక్క‌. ఇది దేశంకాని దేశంలో నిజంగానే గ్రేట్ ఫీట్ అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments