భరత్ మొదటి పాట విడుదల ఆ రోజేనా?

Monday, March 19th, 2018, 06:46:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులు కొరటాల శివ దర్శకత్వం లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ ఓత్, ఫస్ట్ విజన్ ప్రేక్షకుల, అభిమానులనుండి అద్భుత స్పందనను పొందాయి. అంతకాదండోయి భరత్ ఫస్ట్ విజన్ అత్యధిక లైక్ లు పొందిన టీజర్ గా రికార్డులకు ఎక్కింది. రోజు రోజుకి ఈ సినిమా పై హైప్ పెరుగుతూనే వుంది. మహేష్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. బ్రహ్మోత్సవమ్, స్పైడర్ సినిమాలతో డీలా పడ్డ అభిమానులను ఈ సినిమాతో ఖుషి చేయాలనుకుంటున్నారు ఆయన. నిన్న ఉగాది సందర్భంగా మహేష్ పంచెకట్టు లో వున్న స్టిల్ సినిమా యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

విడుదలయినప్ప్పటినుండి ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లోని తొలి పాటను శ్రీరామ నవమి కానుకగా ఈ నెల 24 విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వచ్చాడయ్యా సామి’ అనే పల్లవి తో సాగే ఈ పాటను ప్రముఖ గాయకులు కైలాష్ ఖేర్ ఆలపించారట. ఇప్పటికే మహేష్, దేవి కంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ హాట్ట్రిక్ సినిమాలో పాటలు ఎలావుంటాయో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే….