జియో కి మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్ ప్రకటించిన ఎయిర్టెల్

Thursday, September 29th, 2016, 03:13:44 PM IST

jio
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో ని తలదన్నే వాడే లేడా ? మూడు నెలలు పూర్తిగా ఉచిత ఇంటర్నెట్ తో పాటు ఉచిత కాల్స్ కూడా చేసుకోవడానికి రిలయన్స్ జియో ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇప్పుడు వాడవాడలా ప్రసరిస్తోంది. దాదాపు అన్ని రిలయన్స్ దుకాణాల బయటా జనాలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. అయితే రిలయన్స్ జియో ని తలదన్నే ఆఫర్ ఇవ్వలేకపోవచ్చు కానీ రిలయన్స్ కి ఖచ్చితంగా షాక్ మాత్రం ఇస్తాం అంటున్నారు ఎయిర్టెల్ వారు. రిలయన్స్ దెబ్బతో ఎక్కువగా నష్టపోయిన సంస్థ ఎయిర్టెల్ అనే చెప్పాలి. సిగ్నల్ దగ్గర నుంచీ క్వాలిటీ వరకూ అన్నింటా టాప్ గా ఉన్న ఎయిర్టెల్ ని జియో తక్కువ టైం లో క్రాస్ చేసింది. అద్భుతమైన , తిరుగులేని ఆఫర్లు ఇస్తూ వినియోగదారులని తనవైపుకి తిప్పేసుకుంది జియో. ఇప్పుడు ఎయిర్టెల్ స్వయంగా రంగంలోకి దిగి జియో కి దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చింది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ను వినియోగదారులకు అందుబాటులోకి తెసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద అన్ని అంతర్జాతీయ ఇన్ కమింగ్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ నెంబర్ లో ఏ దేశం లో వాడినా ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా పడదు అని ఆఫర్ ఇచ్చింది ఎయిర్టెల్. ఎక్కువ కాల్ చార్జీలు, డేటా రీచార్జ్ ల విషయం లో కూడా కంగారు పడక్కర్లేదు అనీ ఈ ప్యాక్ ఇప్పుడు పోస్ట్ పైడ్ తో పాటు ప్రీపెయిడ్ కస్టమర్ లకి కూడా వర్తిస్తుంది అని ఎయిర్టెల్ తెలుపుతోంది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్కమింగ్ కాల్స్, ఇండియాకు ఉచితంగా మెసేజ్లు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు అన్ని ప్రముఖ దేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు డేటా ప్రయోజనాలు కూడా అందిస్తామని పేర్కొంది.

  •  
  •  
  •  
  •  

Comments