భ‌ట్టి విక్ర‌మార్క.. ధీక్ష‌తో ఒరిగిందేంటి?

Monday, June 10th, 2019, 04:34:01 PM IST

తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి ఇంకా చ‌ల్లార‌డం లేదు. నిప్పుల కొలిమిలా ఉన్న సూరీడు చ‌ల్ల‌బ‌డుతున్నా రాజ‌కీయ ప్ర‌కంప‌ణ‌ల వేడి మాత్రం చ‌ల్లార‌డం లేదు. సీఎల్పీని తెరాస‌లో విలీనం చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఇంద‌రా పార్క్ వ‌ద్ద నిరాహార దీక్ష‌కు పూనుకున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో బ‌ల‌వంతంగా ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసిన పోలీసులు నిమ్స్‌కు త‌ర‌లించ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీస్తోంది. భ‌ట్టినీ అరెస్ట్ చేయ‌డాన్ని నిర‌సిస్తూ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌తో బాహా బాహీకి దిగ‌డంతో కొంత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

భ‌ట్టి రెస్ట్‌కు నిర‌స‌న‌గా ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు సంఘీభావ తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రిపై భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ లాంటి మన‌సున్న ముఖ్య‌మంత్రులు న‌లుగురు వుంటే దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోతుంద‌ని దుమ్మెత్తిపోశారు. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల్సిన రోజులొచ్చాయ‌ని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రాష్ట్ర ప‌తిని, ఎన్నిక‌ల సంఘాన్ని క‌లుస్తామ‌ని భ‌ట్టి పేర్కొన్నారు. అయితే ఈ ధీక్ష‌తో అరెస్టు త‌ప్ప ఒరిగిందేమీ లేద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ‌ను తెరాస ప్ర‌భుత్వం భ‌ళ్లూక‌పు ప‌ట్టు ప‌ట్టిన‌ప్పుడు భ‌ట్టీ విక్ర‌మార్క అయినా ఏమీ చేయ‌లేడ‌ని ఈ ఘ‌ట‌న నిరూపించింది.